CCL 2025 : సినిమా వాళ్ల క్రికెట్ పండగ వచ్చేసింది.. సీసీఎల్ 2025.. తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఇదే.. ఎందులో చూడొచ్చంటే?
శనివారం నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది.

Celebrity Cricket League 2025 starts from tomorrow
మనదేశంలో సినీతారలు, క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సినిమాల్లో అలరించే సినీనటులు బ్యాట్ చేతబట్టి సిక్సర్లు బౌండరీల వర్షం కురిపిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. హీరోలు బ్యాట్‌తో చెలరేగే సమయం దగ్గర పడింది. రేపటి (శనివారం )నుంచి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు తారలు ఆడనున్నారు.
తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు సీసీఎల్-2025 బరిలో నిలిచాయి. తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్‌గా అక్కినేని అఖిల్ ఉండగా.. బెంగాల్ టైగర్ కు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ కిచ్చ సుదీప్, చెన్నై రైనోస్ హీరో ఆర్య, ముంబై హీరోస్ సాకిబ్ సలీం, పంజాబ్ ది షేర్ సోను సూద్, భోజ్‌పురి దబాంగ్స్ మనోజ్ తివారీ లు సారథులుగా వ్యవహరించనున్నారు.
RGV : ఏ సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోని ఆర్జీవీ.. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం బాధపడ్డాడు తెలుసా..
సీసీఎల్ 2025లో తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 8న – కర్ణాటక బుల్డోజర్స్
ఫిబ్రవరి 14న – భోజ్‌పురి దబాంగ్స్
ఫిబ్రవరి 15న – చెన్నై రైనోస్
ఫిబ్రవరి 23న – బెంగాల్ టైగర్స్
Sobhita Dhulipala-Naga Chaitanya : చైతన్యపై శోభిత బ్యూటిఫుల్ పోస్ట్.. ఇన్నాళ్లకు నీ ముఖదర్శనం సామీ..
ఎక్కడ చూడొచ్చంటే?
సీసీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లను సోనీ టెన్ 3 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో చూడొచ్చు.