Chandra Mohan Family : చంద్ర మోహన్ ఫ్యామిలీ గురించి.. భార్య పెద్ద రచయిత్రి.. పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా?

చంద్ర మోహన్ భార్య జలంధర కూడా ప్రముఖ రచయిత్రి. దాదాపు 100 కు పైగా కథలు, పలు నవలలు రాశారు ఆమె.

Chandra Mohan Family His Wife and Daughters Full Details

Chandra Mohan Family : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఇటీవల హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా ఈరోజు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

చంద్ర మోహన్ భార్య జలంధర కూడా ప్రముఖ రచయిత్రి. దాదాపు 100 కు పైగా కథలు, పలు నవలలు రాశారు ఆమె. పలు సాహితీ పురస్కారాలు కూడా అందుకున్నారు జలంధర. పెళ్లి తర్వాత కూడా భార్య భర్తలు ఇద్దరూ తమతమ రంగాలలో ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. ఈమె BA ఎకనామిక్స్ కూడా చదువుకున్నారు.

ఇక చంద్రమోహన్, జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరడ్డారు. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ గా చెన్నైలో ఉంటున్నారు.

Also Read : Chandra Mohan : హీరో నుంచి తండ్రి పాత్రలతో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. చంద్రమోహన్ సినీ ప్రస్థానం..

దివంగత ప్రముఖ దర్శకుడు కళాతపస్వి K విశ్వనాధ్.. చంద్రమోహన్ కి బంధువు అవుతారు. చంద్ర మోహన్ సినిమాల్లోకి రావడానికి, ఎదగడానికి విశ్వనాధ్ కూడా సాయం అందించారు. ఈ విషయాన్ని చాలా సందర్భంగాల్లో చంద్రమోహన్ స్వయంగా చెప్పారు. చెన్నైలో పక్కపక్కనే ఇళ్లు కట్టుకుని పాతకేళ్లు అక్కడే ఉన్నారు కూడా.