Chandramukhi 2: చంద్రముఖి ఎలా డ్యాన్స్ చేస్తుందో చూశారా?.. తొలి పాటలోనే ఇరగదీసిన హీరోయిన్
కంగనా రనౌత్ నాట్య భంగిమలను చూపిస్తూ ఈ వీడియోను విడుదల చేశారు. చంద్రముఖి-1 క్లైమాక్స్ లో..

Kangana Ranaut
Chandramukhi 2 – Kangana Ranaut: చంద్రముఖి-2 సినిమా నుంచి తొలి సాంగ్ విడుదలైంది. చంద్రముఖిగా నటిస్తున్న కంగనా రనౌత్ నాట్యంతో అలరించింది. స్వాగతాంజలి… అంటూ సాగుతున్న ఈ పాటను చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad) రాశారు. శ్రీనిధి తిరుమల ఆలపించారు. లాస్య విలసిత.. నవ నాట్య దేవత.. నటనాంకిత.. అంటూ ఈ పాట సాగుతోంది.
కంగనా రనౌత్ నాట్య భంగిమలను చూపిస్తూ ఈ వీడియోను విడుదల చేశారు. చంద్రముఖి-1 క్లైమాక్స్ లో జ్యోతిక డ్యాన్స్ చేసి అందరినీ భయపెడుతుంది. కంగనా రనౌత్ మాత్రం ఈ నాట్యంలో చాలా కోమలంగా కనపడుతోంది. ఈ సినిమా హీరో రాఘవ లారెన్స్ నూ ఇందులో చూపించారు. అతడి కాస్ట్యూమ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎం.ఎం.కీరవాణి బాణీలు సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ తో పాటు వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Ustaad Pre Release Event : ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ.. రాజమౌళి, నాని స్పెషల్ అప్పీరెన్స్..