Prabhas – Charan : బ్రో కోడ్ బ్రేక్ చేసి ప్రభాస్‌ని ఆడుకున్న చరణ్.. సనన్ లేదా శెట్టి?

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఎపిసోడ్ మొత్తం చాలా సరదాగా సాగింది. బాలకృష్ణ, ప్రభాస్ పెళ్లి అండ్ రేలషన్‌షిప్ గురించి అడిగి ప్రభాస్ ని ఒక ఆట ఆదుకున్నాడు. అయితే ఎపిసోడ్‌కే హైలైట్ గా నిలిచింది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాల్. ఈ ఫోన్ కాల్ లో బాలకృష్ణ, చరణ్ ని..

Prabhas – Charan : బ్రో కోడ్ బ్రేక్ చేసి ప్రభాస్‌ని ఆడుకున్న చరణ్.. సనన్ లేదా శెట్టి?

Charan broke the bro code and tease Prabhas

Updated On : December 30, 2022 / 8:44 AM IST

Prabhas – Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టకేలకి తెరపడింది. అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందుగానే ప్రసారం చేస్తున్నాము అని నిన్న ప్రకటించిన ఆహా టీం.. నిన్న రాత్రి 9 గంటలకు పార్ట్-1 ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అయితే అభిమానులు నుంచి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో ఆహా సైట్ క్రాష్ అయ్యింది. అయితే కొంత సమయానికే దానిని పరిష్కరించి ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Unstoppable Season 2 : ‘అన్‌స్టాపబుల్’ స్ట్రీమింగ్‌ని నిలిపివేయాలి.. ఢిల్లీ హై కోర్ట్!

ఇక ఎపిసోడ్ మొత్తం చాలా సరదాగా సాగింది. బాలకృష్ణ, ప్రభాస్ పెళ్లి అండ్ రేలషన్‌షిప్ గురించి అడిగి ప్రభాస్ ని ఒక ఆట ఆదుకున్నాడు. అయితే ఎపిసోడ్‌కే హైలైట్ గా నిలిచింది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాల్. ఈ ఫోన్ కాల్ లో బాలకృష్ణ, చరణ్ ని.. ‘ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రేలషన్‌షిప్‌లో ఉన్నాడో చెప్పు’ అని అడిగాడు. అయితే దానికి చరణ్.. “సారీ బాలయ్య గారు మాకు ఒక బ్రో కోడ్ ఉంటుంది. దానిని బ్రేక్ చేయలేను” అన్నాడు.

ఈ బ్రో కోడ్‌లు మన దగ్గర చెల్లవు, ప్రస్తుతం ప్రభాస్ ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. రాజులా, రెడ్డిలా, నాయుళ్ళ, చౌదరిలా, సనన్ లేదా శెట్టినా అనేది నువ్వు చెప్పాల్సిందే అని బాలయ్య బలవంతం చేయగా రామ్ చరణ్.. ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని చెప్పి బాలకృష్ణతో కలిసి ప్రభాస్ ని కాసేపు ఆడుకున్నాడు. దీంతో ప్రభాస్, చరణ్‌తో.. “ఒరేయ్ చరణ్ నువ్వు అసలు నా ఫ్రెండ్‌వా? శత్రువా? మన బ్రో కోడ్ ని బ్రేక్ చేసి నన్ను ఆడుకుంటావా నీ పని చెబుతాను ఆగు. సార్ చరణ్ గాడు ఈ షోకి వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి లేదా నన్ను పిలవండి అప్పుడు చెబుతా నేను కూడా” అని అనడం అందర్నీ ఎంతగానో నవ్వించింది.

ఇక ప్రభాస్ అడిగిన దానికి బాలయ్య కూడా ఓకే చెప్పి చరణ్ ఎప్పుడు వస్తున్నావు అని అడగా.. “మాట దూరం సార్, మీరు పిలవండి వచ్చేస్తా” అని చెప్పాడు. దీంతో నెక్స్ట్ సీజన్ లో రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ కి రాబోతున్నాడు అనేది కన్‌ఫార్మ్ అయ్యింది.