Cheater : ‘చీటర్’ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ విడుదల చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.. సెప్టెంబర్ 22న చీటర్ విడుదల..

చీటర్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన విడుదల చేశారు.

Cheater : ‘చీటర్’ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ విడుదల చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన.. సెప్టెంబర్ 22న చీటర్ విడుదల..

Cheater Movie first look and Releasing date released by Director Trinatharao Nakkina

Updated On : August 19, 2023 / 5:56 PM IST

Cheater : యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాత గా, బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” చీటర్ “. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో త్రినాధ్ రావ్ మాట్లాడుతూ.. సినిమా ఫస్ట్ లుక్ చూసాను చాలా బాగుంది, టీం అందరికీ మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ.. మా సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించడం జరిగింది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది అని తెలిపారు.

Allu Ayaan : అమ్మమ్మ, తాతయ్యలతో అల్లు అయాన్.. నల్గొండలో తనయుడు అయాన్‌తో బన్నీ సందడి..

నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మేము అనుకున్నట్టు సినిమా వచ్చింది, మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడి పనిచేసారు. మంచి అవుట్ పుట్ వచ్చింది, ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది, సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదల అవుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని నమ్మకం ఉంది అని తెలిపారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ చేశారు.