Abhilasha Patil : సినీ పరిశ్రమలో మరో విషాదం, కరోనాతో నటి కన్నుమూత
కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో

Abhilasha Patil
Abhilasha Patil : కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం(మే 5,2021) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. షూటింగ్ కోసం బెనారస్‌కు వెళ్లిన ఆమెకు కరోనా సోకింది. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను వెంటనే ఐసీయూకి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో అభిలాష చనిపోయింది. మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’ తో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించింది. అభిలాష మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా బాడీ బిల్డర్ లాంటి ఫిట్ నెస్ యోధులు కూడా కరోనా ధాటికి మృత్యువాత పడుతున్నారు. టాలీవుడ్ లోనూ పలువురు సినీ ప్రముఖులను కరోనా పొట్టనపెట్టుకుంది.