Chicken Song : సగిలేటి కథ నుంచి చికెన్ సాంగ్ ని చూశారా? భలేగుంది.. చికెన్ కోసం మీసం తాకట్టు పెట్టి..

తాజాగా సగిలేటి కథ సినిమా నుంచి చికెన్ సాంగ్ రిలీజయింది. ఈ పాట వింటుంటే భలే సరదాగా ఉంది. సినిమాలో ఈ పాట చాలా కీలకం అట.

Chicken Song : సగిలేటి కథ నుంచి చికెన్ సాంగ్ ని చూశారా? భలేగుంది.. చికెన్ కోసం మీసం తాకట్టు పెట్టి..

Chicken Sing Launched from Sagileti Katha Movie must listen this funny chicken song

Updated On : October 6, 2023 / 3:40 PM IST

Sagileti Katha Chicken Song : రవి మహాదాస్యం(Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్‌(Vishika Laxman) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సగిలేటి కథ(Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది.

తాజాగా సగిలేటి కథ సినిమా నుంచి చికెన్ సాంగ్ రిలీజయింది. ఈ పాట వింటుంటే భలే సరదాగా ఉంది. సినిమాలో ఈ పాట చాలా కీలకం అట. ఇక ఈ ‘చికెన్’ సాంగ్ ని కోడికూర చిట్టిగారే అనే రెస్టారెంట్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నవదీప్, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, కేర్ ఆఫ్ కంచరపాలెం వెంకటేష్ మహా, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్.. ఇలా పలువురు వచ్చారు.

చికెన్ సాంగ్ లాంచ్ అనంతరం డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని హీరో నవదీప్ ప్రెజెన్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. నాకు ఒకరోజు ప్రొడ్యూజర్ SKN సగిలేటికథ సినిమా ట్రైలర్ చూపించారు. ఆ ట్రైలర్ చూసినప్పుడే నేను బలంగా నమ్మాను. ఈ సినిమా సూపర్ హిట్ అని. సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా నటించారు. తప్పకుండా, ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. నాకు నవదీప్ కాల్ చేసి ఇలా, సాంగ్ లాంచ్ ఉంది మీరు రావాలి అన్నారు. ట్రైలర్, పోస్టర్స్ చూసాక చాలా ప్రామిసింగ్ గా అనిపించాయి. రూట్ లెవెల్ లో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని నవదీప్ చెప్పారు. క్లైమాక్స్, విన్నాక ఇది మరో బ్లాక్ బాస్టర్ అనిపించింది. డైరెక్టర్ రాజశేఖర్ కి మంచి భవిషత్తు ఉంది అని అన్నాడు.

Chicken Song Launched from Sagileti Katha Movie must listen this funny chicken song

 

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ముందుగా నవదీప్ అన్నయ్య కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో కొత్త వాళ్ళైనా నటన అద్భుతంగా చేసారు. ముఖ్యంగా, సినిమాలో మ్యూజిక్ వేరే లెవెల్. నేను చికెన్ లిరికల్ సాంగ్ చూడగానే, ఈ సినిమా పక్కా హిట్ అనిపించింది. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఎంతో ప్రధానం. కాబట్టి, ఈ సినిమా మరో ‘బలగం’ రేంజ్ లో హిట్ కొడతారని బలంగా నమ్ముతున్నాను అని తెలిపారు.

Also Read : Sai Soujanya : నిర్మాతగా సినిమాల్లో త్రివిక్రమ్ వైఫ్ వర్క్ ఏంటో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

హీరో నవదీప్ మాట్లాడుతూ.. మా సి స్పెస్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నందుకు మా టీమ్ అందరు చాలా హ్యాపీ. డైరెక్టర్ రాజశేఖర్ చాలా టాలెంటెడ్, స్వతహాగా పైకి వస్తున్న వ్యక్తి. పైగా, అన్ని క్రాఫ్ట్స్ ని తనే స్వయంగా హ్యాండిల్ చేసి టీమ్ ని ముందుకి నడిపించారు. ప్రొడ్యూజర్స్, దేవి ప్రసాద్ బలివాడ, అశోక్ కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ నాకు ఇష్టం. అలాగే, ఈ సినిమాలో కామిడి అందరిని నవ్విస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసాక చికెన్ తినాలనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వెజిటేరియన్ వాళ్లకి కూడా. మా మూవీ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి వస్తుంది, ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.