రాధా రవి ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతాడు? మీడియా ముందుకొస్తా..

కోలీవుడ్ : మరోసారి వివాదానికి తెర లేపిన డబ్బింగ్ యూనియన్ ఎలక్షన్స్.. ఏకగ్రీవంగా ఎన్నికైన రాధా రవి..

  • Published By: sekhar ,Published On : February 6, 2020 / 06:46 AM IST
రాధా రవి ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతాడు? మీడియా ముందుకొస్తా..

Updated On : February 6, 2020 / 6:46 AM IST

కోలీవుడ్ : మరోసారి వివాదానికి తెర లేపిన డబ్బింగ్ యూనియన్ ఎలక్షన్స్.. ఏకగ్రీవంగా ఎన్నికైన రాధా రవి..

కోలీవుడ్ : దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్‌ ఎన్నికలు బుధవారం (ఫిబ్రవరి 5) చెన్నైలో జరిగాయి. ఎన్నికల్లో రాధా రవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరస్కరించడం తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రాధా రవి, చిన్మయిల మధ్య చాలా కాలంగా వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

రాధా రవిపై చిన్మయి తీవ్ర స్థాయిలో మీటూ ఆరోపణలు గుప్పించడంతో తల పండిన రాధా రవి తన పలుకుబడితో ఆమెను డబ్బింగ్ యూనియన్ నుండి తప్పించాడు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన చిన్మయి కోర్టును ఆశ్రయించాగా.. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది.

rc

అలా ఆమె యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకోగలిగింది. కాగా బుధవారం  జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో రాధా రవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విధానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో పోటీదారుడైన రాధా రవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

దీంతో డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్‌ తిరస్కరణపైనా, రాధా రవిని ఏకగ్రీవంగా ఎంపిక చేయడంపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఈ విషయం గురంచి మాట్లాడడానికి చిన్మయి గురువారం మీడియా ముందుకు రానున్నారు.