Sankranthi 2027: 2027 సంక్రాంతి మాములుగా ఉండదు.. టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ దిగుతున్నారు
2027 సంక్రాంతికి రిలీజ్ కానున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు(Sankranthi 2027).
Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh movies releasing for 2027 Sankranthi.
- ప్రత్యేకంగా మారనున్న 2027 సంక్రాంతి
- టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ సినిమాలు విడుదల
- చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు రిలీజ్
Sankranthi 2027: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ హీరోలకు ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నలుగురిని టాలీవుడ్ పిల్లర్స్ గా కూడా చెప్తుంటారు. అందుకే, ఈ టాప్ స్టార్స్ సినిమాలు ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తూ ఉంటారు. కానీ, ఈ నలుగురు హీరోల సినిమాలు ఒకే సీజన్ లో విడుదల అయితే ఎలా ఉంటుంది.
అబ్బా.. ఆ ఊహే ఎంత బాగుందో కదా. అవును, ఇప్పుడు ఆ ఊహ నిజం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నలుగురు హీరోలు ఒకే సీజన్ లో తమ సినిమాలను థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. ఆ సీజన్ మరేదో కాదు సినిమా లవర్స్ కి బాగా నచ్చే సంక్రాంతి సీజన్. 2027 సంక్రాంతి(Sankranthi 2027) సీజన్ లో ఈ నలుగురి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Spirit: స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?
వాటిలో మొదటగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి సినిమా ఉంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ ఇద్దరు మళ్ళీ కలిసి వస్తుండటంతో ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహ రెడ్డి ఎంత భారీ విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ సాధించింది.
ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్న నాయన, బంగార్రాజు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ కురసాల చేస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నట్టుగా అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఇక వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు నాలుగోసారి ఈ ఇద్దరు కలిసి రానున్నారు. సంక్రాంతిని తన ఫేవరేట్ సీజన్ గా మార్చుకున్న అనిల్ రావిపూడి మరోసారి తనకు అచ్చొచ్చిన సీజన్ లో తన ఫేవరేట్ హీరోతో బరిలోకి దిగనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ నలుగురు ఒకే సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారి ఈ ఫీట్ జరుగనుంది. మరి బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉండబోతాయి అనేది చూడాలి.
