Chiranjeevi – Pawan Kalyan : మెగా ఇంట మదర్స్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన చిరు.. పవన్ పిక్‌ని మాత్రం!
మదర్స్ డేని మెగా బ్రదర్స్ తమ తల్లి అంజనా దేవితో కలిసి బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను షేర్ చేసిన చిరు.. పవన్ పిక్‌ని మాత్రం

Chiranjeevi celebrates mothers day with his mother but Pawan Kalyan
Chiranjeevi – Pawan Kalyan Mothers Day Photos : నేడు (మే 14) మదర్స్ డే కావడంతో కామన్ మ్యాన్ నుంచి సెలబ్రేటిస్ వరకు ప్రతి ఒక్కరు అమ్మ పై తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్స్ కూడా మదర్స్ డేని తమ తల్లి అంజనా దేవితో కలిసి బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి, నాగబాబు, మరియు ఇద్దరు సిస్టర్స్ తమ అమ్మకి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
Chiranjeevi : ఆ ఇద్దరి యంగ్ డైరెక్టర్స్‌తో చిరంజీవి సినిమా.. నిజమేనా?
ఇక అందుకు సంబంధించిన పిక్స్ ని షేర్ చేస్తూ.. “అనురాగం, మమకారం ఈ రెండిటికి అర్ధమే అమ్మ. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి మదర్స్ డే శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. అయితే చేసిన ఫొటోల్లో పవన్ పిక్ మాత్రం అంతకుముందు తమ అమ్మతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దీంతో ఈసారి మదర్స్ డే నాడు పవన్ తమ అమ్మ అంజనా దేవి ఆశీస్సులు తీసుకోలేదని తెలుస్తుంది.
Ram Charan fans : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని చితక్కొట్టిన చరణ్ ఫ్యాన్స్..
మొన్నటి వరకు సినిమా షూటింగ్ లో ఉన్న పవన్.. గత నాలుగు రోజులు నుంచి రాజకీయ వ్యవహారాల్లో పాల్గొంటున్నాడు. ఈ బిజీ లైఫ్ వలనే పవన్ కళ్యాణ్ రాలేకపోయాడని తెలుస్తుంది. ఇక పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG మూవీ షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే OG మూవీ షెడ్యూల్స్ పూర్తి చేసిన పవన్.. ఉస్తాద్ సెట్స్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay?? pic.twitter.com/6Xm4l1R14d— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023