Chiru – Balayya : బాలయ్యతో సినిమా చేస్తున్నాడని తెలిసి.. దర్శకుడు బాబీకి ఫోన్ చేసి చిరు ఏమన్నారంటే..

'వాల్తేరు వీరయ్య' తరువాత దర్శకుడు బాబీ, బాలయ్యతో సినిమా చేస్తున్నాడని తెలిసి చిరు ఫోన్ చేసి..

Chiru – Balayya : బాలయ్యతో సినిమా చేస్తున్నాడని తెలిసి.. దర్శకుడు బాబీకి ఫోన్ చేసి చిరు ఏమన్నారంటే..

Chiranjeevi comments about Nandamuri Balakrishna NBK109 with director bobby

Updated On : January 18, 2024 / 5:14 PM IST

Chiranjeevi – BalaKrishna : చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బాబీ.. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలయ్యి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ ని ఊటీలో మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. అక్కడ దాదాపు 20 రోజులు పాటు ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించారు.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని రాజస్థాన్ లో ప్లాన్ చేసినట్లు బాబీ ఇటీవల తెలియజేశారు. నెక్స్ట్ వీక్ నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, బాబీ రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ.. బాలయ్య సినిమా గురించి చిరంజీవి ఏమన్నారో తెలియజేశారు. గత ఏడాది జూన్ 10న సినిమా స్టార్ట్ చేయగానే చిరు నుంచి బాబీకి ఫోన్ వచ్చిందట.

Also read : Avantika Vandanapu : హాలీవుడ్‌లో సూపర్ హిట్.. అయినా షాప్‌లో పని చేస్తున్న తెలుగు సెన్సేషన్ అవంతిక..

“తమ్ముడు బాలయ్యతో సినిమా చేస్తున్నావు అంటగా. అది వాల్తేరు వీరయ్య కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టు కష్టపడు. అసలు రిలాక్స్ అవ్వకు” అంటూ చెప్పారంట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని చిరు ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా 1980 స్టోరీతో సాగబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా వైలెంట్ ఉండబోతుందట.

సినిమా అనౌన్స్ చేస్తూనే ‘వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు’ అంటూ ఆడియన్స్ లో హైప్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించబోయే ఇతర పాత్రలు గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ సినిమాకి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.