Chiranjeevi : ఆ విషయంలో నాకు వరుణ్ మీద కోపం ఉంది..

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడగగా చిరు, వరుణ్ సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో..

Chiranjeevi : ఆ విషయంలో నాకు వరుణ్ మీద కోపం ఉంది..

Chiranjeevi comments on Varun Tej in Operation Valentine Pre Release Event goes Viral

Chiranjeevi : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operational Valentine) మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్, ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా నేడు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు.

Also Read : Abhinav Gomatam : చిరంజీవి సినిమాకి రివ్యూ ఏంటి బ్రో.. మళ్ళీ రివ్యూల గురించి మాట్లాడిన అభినవ్ గోమఠం..

ఈ ఈవెంట్లో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడగగా చిరు, వరుణ్ సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో వరుణ్ – లావణ్య లవ్ గురించి మీరు ఎందుకు లీక్ చేయలేదు అని సుమ అడగ్గా చిరంజీవి.. వరుణ్ లావణ్య లవ్ స్టోరీ గురించి నాకు చెప్పలేదు. వాళ్ల నాన్నకి చెప్పలేనివి కూడా నాకు చెప్తాడు. కానీ ఇది చెప్పలేదు. అందుకు నాకు వరుణ్ మీద కోపం ఉంది అన్నారు. దీనికి వరుణ్ .. అది గౌరవంతో కూడిన భయం అందుకే చెప్పలేదు. కానీ అంత ఓకే అనుకున్నాక మొదట పెదనాన్నకే చెప్పాను అని అన్నారు.