గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడంపై చిరు కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Megastar Chiranjeevi name in Guinness Book of World Records
మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఎక్స్‌లో స్పందించారు.
తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు, తనను నడిపించిన దర్శకులతో పాటు అద్భుతమైన గీతాలా ఇచ్చిన సంగీత దర్శకులకు ఈ ఘతన దక్కుతుందని చెప్పారు. అన్ని వెరైటీ స్టెప్పులు కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్స్‌కు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందని తెలిపారు.
తనను అమితంగా ప్రేమించడంతో పాటు తన డ్యాన్సులను ఇష్టపడిన అందరికీ ఇది అంకితమని చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సినీ కెరీర్‌లో నటనతోనే కాకుండా డ్యాన్స్‌లోనూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఈ వయసులోనూ ఆయన వేసే స్టెప్పులకు యమ క్రేజ్ ఉంది. డ్యాన్స్‌లో మైఖేల్ జాక్సన్, చిరంజీవి, ప్రభుదేవా అంటే తనకు ఎంతో ఇష్టమని గతంలో అల్లు అర్జున్ కూడా అన్నారు. ఇదే మిగతా తెలుగు అభిమానుల చాలా మంది మాట కూడా.
My heart is filled with gratitude ❤️🙏
The Guinness World Record is something
I had never imagined.This became possible ONLY because of Each one my Producers and Directors who have given me opportunities over the years.
ALL the Music Directors who have composed great songs and…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 23, 2024
Bigg Boss 18 Promo : హిందీ బిగ్ బాస్.. సీజన్ 18 ప్రోమో రిలీజ్.. ఎప్పట్నించి మొదలు అంటే..