Chiranjeevi : అయోధ్య ఆహ్వానం పై చిరు ఎమోషనల్.. ఈ అంజనీ దేవి పుత్రుడికి..

అయోధ్య ఆహ్వానం పై చిరు ఎమోషనల్ పోస్ట్. ఇక అయోధ్యకి బయలుదేరబోతున్న చిరు, చరణ్‌కి శుభాకాంక్షలు తెలియజేయడానికి చిరు ఇంటి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.

Chiranjeevi emotional post on Ayodhya Ram Mandir Opening Ceremony invitation

Chiranjeevi : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ మహత్తర కార్యక్రమం రేపు జనవరి 22న ఘనంగా జరగబోతుంది. ఇక వేడుకకు హాజరుకావాలంటూ దేశంలోని పలు రంగాలోని ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ మెంబెర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కి కూడా ఆహ్వానాలు అందాయి.

దీంతో రేపు జరగబోయే ఆ అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠని కళ్లారా చూసేందుకు మెగా ఫ్యామిలీ అక్కడికి బయలుదేరుతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయోధ్యకి చేరుకున్నారు. ఈ రాత్రికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు కూడా బయలుదేరనున్నారు. ఇక అయోధ్యకి బయలుదేరబోతున్న చిరు, చరణ్‌కి శుభాకాంక్షలు తెలియజేయడానికి మెగా ఫ్యాన్స్ చిరు ఇంటికి చేరుకున్నారు. దీంతో చిరు, చరణ్ బయటకి వచ్చి వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Also read : Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

ఇక ఈ ఆహ్వానం పై చిరు ఎమోషనల్ అవుతూ ట్వీట్ వేశారు. “ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం నిజంగా అపరిమితమైన అనుభూతి. ఇక ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి నాకు దేవుడిచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను.

ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా ఇది వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది కొత్త చరిత్ర నాంది, ఉన్న చరిత్రకు ఉర్రూత, దేశ చరిత్రలోనే చిరస్థాయి. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.