మెగా హౌస్.. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా విలాసవంతమైన భవనం!
దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో మంచి గార్డెనింగ్ చేయించాడంటున్నారు.

Megastar Chiranjeevi
చిన్న బ్రేక్ దొరికితే చాలు.. సెలబ్రిటీలు సేద తీరడానికి ఫారిన్ చెక్కేస్తుంటారు. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో సహా కూల్ వెదర్ ఉండే ప్లేస్‌కు వెళ్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటివరకు అలానే చేశారు. చిరు తిరగని కంట్రీ లేదు. అలా తిరిగి తిరిగి ఫారిన్ కంట్రీస్‌పై బోర్ వచ్చేసిందంట. ఇక నుంచి ఫారిన్ ట్రిప్స్ తగ్గించి ఇండియాలోనే ఓ నేచరల్ ప్లేస్‌లో గడపాలని అనుకుంటున్నారట. అందుకోసం ఓ ప్రముఖ ప్రదేశంలో అత్యంత ఖరీదైన ఓ విలాసవంతమైన భవనం కొన్నాడంటున్నారు.
చిరు తీసుకున్న ప్రాపర్టీ ఎక్కడో కాదు ఊటీలో. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో మంచి గార్డెనింగ్ చేయించాడంటున్నారు. ఓ మినీ ఫారెస్ట్ లాంటిది కట్టేశాడంటున్నారు. ఇక నుంచి సినిమాలకు ఏ మాత్రం బ్రేక్ వచ్చిన అక్కడకు వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారట. చిరంజీవి కట్టుకున్న ఫాంహౌస్‌కు ఖర్చు కూడా బాగానే అయిందంటున్నారు.
చిరు తీసుకున్న ప్లేస్..అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు చక్కని లొకేషన్‌గా ఉందట. ఊటీలో చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు విలాసవంతమైన ప్రాపర్టీలు కొంటున్నారు. ఆ కోవలోనే మెగాస్టార్ కూడా అక్కడ ప్రాపర్టీ తీసుకున్నారని అంటున్నారు. రామ్‌చరణ్, ఉపాసన కూడా ఈ ప్రాపర్టీని సందర్శించారట. అయితే చిరంజీవికి ఇప్పటికే బెంగళూరులో ఫాంహౌస్ ఉంది. త్వరలో గోవాలోనూ మంచి లొకేషన్ చూసి.. ఓ గెస్ట్ హౌస్ తీసుకోవాలని చిరు ప్లానింగ్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Maa Nanna Super Hero Trailer : సుదీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వచ్చేసింది..