Chiranjeevi : మరోసారి యంగ్ డైరెక్టర్స్ కి చిరంజీవి సలహాలు..
చిరంజీవి మాట్లాడుతూ.. 1983లో ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు 2023లో వాల్తేరు వీరయ్య సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ చేసింది. బాబీ చాలా కష్టపడ్డాడు. కష్టపడేవాడికి సక్సెస్ ఎప్పుడూ వస్తుంది. సినిమా చివరిదాకా..................

Chiranjeevi gives suggestions to young directors again
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయింది. ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే సినిమా హిట్ అయినందుకు సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ కూడా విచ్చేశాడు.
ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి చాలా సేపు మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రతి సభలోను డైరెక్టర్ బాబీ గురించి గొప్పగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఈవెంట్ లో కూడా బాబీని అభినందించారు. ఇటీవల చిరంజీవి ఎక్కువగా డైరెక్టర్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ పీకడం, రాబోయే యువ డైరెక్టర్స్ కి సలహాలు ఇవ్వడం చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో కూడా చిరంజీవి మాట్లాడుతూ మరోసారి యువ డైరెక్టర్స్ కి సలహాలు ఇచ్చారు.
Chiranjeevi : వాల్తేరు వీరయ్య.. నాన్ రాజమౌళి రికార్డ్స్..
చిరంజీవి మాట్లాడుతూ.. 1983లో ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు 2023లో వాల్తేరు వీరయ్య సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ చేసింది. బాబీ చాలా కష్టపడ్డాడు. కష్టపడేవాడికి సక్సెస్ ఎప్పుడూ వస్తుంది. సినిమా చివరిదాకా కష్టపడుతూనే ఉన్నాడు. అతని కష్టం, అతనికి సినిమా మీద ఉన్న ప్రేమ, అతని పట్టుదల చూసి నాకు ముచ్చటేసింది. బాబీ నా అభిమాని అని చెప్తుంటాడు. కానీ అతని కష్టం చూసి నేను బాబీకి అభిమానిని అయ్యాను. తక్కువ డేట్స్ లో ఇచ్చిన బడ్జెట్స్ లో సినిమా తీశాడు. అసలు ఎక్కడా ఏది వేస్ట్ చేయలేదు. డైరెక్టర్స్ ఇదే నేర్చుకోవాలి. సినిమాలో వేస్టేజ్ ఎక్కువ షూట్ చేయకుండా ఏదున్నా పేపర్ మీదే మార్పులు చేర్పులు చేసుకోవాలి. నిర్మాతలకి సపోర్ట్ గా ఉండాలి డైరెక్టర్. వచ్చే యంగ్ డైరెక్టర్స్ బాబీ లాంటి దర్శకుల వద్ద ఇవన్నీ చూసి నేర్చుకోవాలి అని అన్నారు. డైరెక్టర్స్ పై మరోసారి కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.