Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్’ నెక్ట్స్ షెడ్యూల్.. ఎక్కడంటే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో గాడ్‌ఫాదర్ కూడా ఒకటి. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.....

Chiranjeevi Godfather Next Schedule In Mumbai
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో గాడ్‌ఫాదర్ కూడా ఒకటి. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్త లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్‌పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్, గాడ్‌ఫాదర్ చిత్ర నెక్ట్స్ షెడ్యూల్‌ను జూలై 28న ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ను ముంబైలో నిర్వహించనుండగా.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ తాజా షెడ్యూల్‌ను ఆగస్టు 4 వరకు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.
Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
అటుపై మిగతా భాగం షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టులోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌ను దసరాకు వాయిదా వేసింది చిత్ర యూనిట్.