ట్రెండింగ్‌లో చిరు మనవరాలి ఫోటోలు
నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా, కల్యాణ్.. పాప ముఖం చూపిస్తూ మొదటిసారి ఫోటోలు షేర్ చేసాడు..

నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా, కల్యాణ్.. పాప ముఖం చూపిస్తూ మొదటిసారి ఫోటోలు షేర్ చేసాడు..
సోషల్ మీడియా పుణ్యమా అని, సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్నవార్త వినిపించినా, ఏదైనా ఒక్క ఫోటో బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సెలబ్రిటీల కిడ్స్ ఇందుకు మినహా ఇంపు ఏం కాదు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు ‘నవిష్క’ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read : అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక
చిరంజీవి, సురేఖ దంపతుల చిన్నకుమార్తె శ్రీజకు, కళ్యాణ్ దేవ్‌తో మ్యారేజ్ అవడం, కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకి జన్మనివ్వడం తెలిసిందే. ఆ చిన్నారికి నవిష్క అనే పేరు పెట్టారు. ఫస్ట్ టైమ్ పాపను తాతయ్య చిరు, అమ్మమ్మ సురేఖ ఎత్తుకుని ఉండగా తీసిన ఫొటోను, కల్యాణ్ గతేడాది డిసెంబరులో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు.
ఇప్పుడు నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా, కల్యాణ్.. పాప ముఖం చూపిస్తూ మొదటిసారి ఫోటోలు షేర్ చేసాడు. ఫోటోతో పాటు, ‘ఇప్పుడు నాకు తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయంపై నీ వల్లే నమ్మకం కలిగింది. ఎందుకంటే, నువ్వు పుట్టిన క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా నవిష్క’ అని కల్యాణ్‌దేవ్ చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.. కళ్యాణ్, శ్రీజ ఇద్దరూ విడివిడిగా పాపతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పిక్స్‌ని నెటిజన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు.
Also Read : చైనా చౌకబేరం : షియోమీ ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల