మెగా మనసు: రూ.10 లక్షల విరాళం ఇచ్చిన చిరంజీవి

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 05:44 AM IST
మెగా మనసు: రూ.10 లక్షల విరాళం ఇచ్చిన చిరంజీవి

Updated On : April 18, 2019 / 5:44 AM IST

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుకలో తన చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న లారెన్స్ కు చిరంజీవి విరాళం పంపారు. 150మందికి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించిన లారెన్స్ 200మంది పిల్ల‌ల‌కి ఉచిత విద్య‌ని అందిస్తున్నారు. కొంద‌రిని ద‌త్త‌త తీసుకొని వారి బాగోగులను చూస్తున్నారు.

ఇటీవ‌ల‌ కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కి ఏకంగా రూ.కోటి ప్రకటించిన లారెన్స్ తన ట్రస్ట్ ను హైదరాబాద్ లో కూడా ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి లారెన్స్‌కి త‌నవంతు సాయంగా 10 ల‌క్ష‌ల విరాళం అందించారు. కాంచన3 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్ చేతుల మీదుగా ఈ చెక్ ను లారెన్స్ అందుకున్నారు. ఇక లారెన్స్ హీరోగా నటించిన కాంచన3 సినిమా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.