Ram Charan : రామ్ చరణ్ RC16లో చిరంజీవి కూడా నటిస్తున్నాడా..?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చే సినిమాలో చిరంజీవి కూడా నటించబోతున్నాడట. ఇంతకీ చిరు ఏ పాత్రలో కనిపించబోతున్నాడో తెలుసా..?

Chiranjeevi is also part of Ram Charan RC16 movie
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానతో RC16 తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉప్పెన సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. కాగా మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారట. ఇంతకు ముందు తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటించినా.. ఆ సినిమాల్లో ఎవరో ఒకరు గెస్ట్ రోల్‌కే పరిమితమయ్యారు. కానీ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడట.
Baby Movie : 50 డేస్ పూర్తి చేసుకున్న బేబీ.. 100 మిల్లియన్ వ్యూస్.. 100 కోట్లకు..!
ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి రోల్ లోకనిపించబోతున్నాడో తెలుసా..? స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కోచ్‌గా చిరంజీవి పాత్ర ఉండనుందట. స్పోర్ట్స్‌లో హీరోకు మెలకువలు నేర్పే పాత్రకు ఎవరిని తీసుకుందామనే ఆలోచన చేస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి అయితే మంచి హైప్ ఉంటుందని భావించిందట చిత్రం యూనిట్. ఈ పాత్రలో నటించేందుకు మెగాస్టార్ కూడా ఓకే చెప్పడంతో బుచ్చిబాబు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
రంగస్థలం నుంచి పొలిటికల్ డ్రామాపై మోజు పెంచుకుంటున్న రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌స్టార్‌గా మారిపోయారు. డైరెక్టర్ శంకర్ నేతృత్వంలో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ కూడా పొలిటికల్ యాక్షన్ డ్రామాగానే చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత తీయబోయే బుచ్చిబాబు సినిమాలో కూడా ఇంచుమించు అదే డ్రామా ఉంటుందని అంటున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంతో ఉండే సినిమాలో.. పొలిటికల్ యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఉప్పెనతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంతోపాటు డైరెక్టర్ సుకుమార్ కథా సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచి హిట్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి కూడా నటించనున్నారనే సమాచారంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి.