Chiranjeevi : అత్తమ్మ పాడె మోసిన చిరంజీవి.. విషాదంలో అల్లు, మెగా కుటుంబాలు..
నేడు ఆమె అంత్యక్రియలు కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చిరంజీవి అక్కడే ఉన్నారు.(Chiranjeevi)

Chiranjeevi
Chiranjeevi : నేడు అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులంతా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.(Chiranjeevi)
చిరంజీవికి సురేఖను ఇవ్వడంతో అల్లు కనకరత్నమ్మ ఆయనకు అత్తమ్మ అవుతుందని తెలిసిందే. దీంతో నేడు ఆమె అంత్యక్రియలు కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చిరంజీవి అక్కడే ఉన్నారు.
Also Read : Allu Arjun Emotional : చిరంజీవి ఎదుట అల్లు అర్జున్ కంటతడి
ఈ క్రమంలో చిరంజీవి తన అత్తమ్మ పాడె కూడా మోశారు. ఓ వైపు చిరంజీవి పట్టుకోగా మరోవైపు నానమ్మ పాడె ని అల్లు అర్జున్ మోశారు. ఇలా మామ అల్లుళ్ళు కలిసి అల్లు కనకరత్నమ్మ పాడె మోయడంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి.