Ram Charan – Upasana : రామ్ చరణ్ కూతురి పేరేంటో తెలుసా? ఎంత వెరైటీగా ఉందో చూశారా?

నేడు చరణ్ ఉపాసనల పాప బారసాల ఘనంగా జరిగింది. చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరిగినట్టు సమాచారం. ఉపాసన ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించిన డెకరేషన్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని ఊయలలో వేసిన ఫోటోని షేర్ చేసి పేరు తెలిపారు.

Ram Charan – Upasana : రామ్ చరణ్ కూతురి పేరేంటో తెలుసా? ఎంత వెరైటీగా ఉందో చూశారా?

Chiranjeevi shared Ram Charan and Upasana Daughter name in Twitter name goes viral

Updated On : June 30, 2023 / 4:34 PM IST

Chiranjeevi : రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలిలో, అభిమానుల్లో సంతోషం నెలకొంది. ఇక మెగా వారసురాలిని ఎప్పుడు చూస్తామా? తనకి ఏ పేరుని పెడుతున్నారు? అని చాలా మందిలో ఆసక్తి నెలకుంది. అయితే ఆల్రెడీ ఒక పేరు అనుకున్ననట్లు మొన్న ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ పేరుని పాప బారసాల నాడు తానే అందరికి తెలియజేస్తాను అని కూడా చరణ్ తెలిపాడు.

నేడు చరణ్ ఉపాసనల పాప బారసాల ఘనంగా జరిగింది. చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరిగినట్టు సమాచారం. ఉపాసన ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించిన డెకరేషన్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని ఊయలలో వేసిన ఫోటోని షేర్ చేసి పేరు తెలిపారు. రామ్ చరణ్, ఉపాసనల కూతురి పేరు ‘క్లిం కార’ అని పెట్టారు. దీంతో ఈ పేరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇంత కొత్తగా, వెరైటీగా ఉందని భావిస్తున్నారు అంతా.

Dil Raju son : దిల్‌రాజు తనయుడి మొదటి పుట్టిన రోజు వేడుకల్లో సెలబ్రిటీలు..

అయితే చిరంజీవి దీని గురించి షేర్ చేస్తూ.. ‘క్లిం కార’ అనేది లలితాసహస్రనామం నుంచి తీసుకున్నాము. దాని అర్ధం ప్రకృతి అని, శక్తి అని వస్తుంది. ఆ పేరుతో ఒక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నాము అని ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు చరణ్ కూతురి పేరు వైరల్ గా మారింది. చిరంజీవి, సురేఖతో పాటు ఉపాసన తల్లితండ్రులు ఉన్న ఫోటోని చిరంజీవి షేర్ చేశారు. ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది.