Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్..

కైకాల సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా ఇంటికి రావాలని ప్రార్ధిస్తున్నాను - మెగాస్టార్ చిరంజీవి..

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్..

Kaikala

Updated On : November 21, 2021 / 6:20 PM IST

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. #GetWellSoonKaikalaGaru ఈ విషయం తెలియగానే టాలీవుడ్‌లో అలజడి నెలకొంది. ప్రస్తుతం ఆయన ఐసియులో చికిత్స పొందుతున్నట్లు తెలుపుతూ శనివారం రాత్రి అపోలో హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం ఉదయం కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

No Shave November : ‘ఈ మంత్ మొత్తం గుండె రాయి చేసుకోవాలి’..

‘ఐసియులో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలిసి ఫోన్‌లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది.
ట్రాకియాస్టోమి కారణంగా మాట్లాడలేక పోయినా మళ్లీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు థంబ్స్ అప్ సైగ చేసి, థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు చెప్పారు.

Akhanda : సెన్సార్ టాక్.. ‘సింహ’ గర్జన సాలిడ్‌గా ఉంటుందంట..

ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా ఇంటికి రావాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయం పంచుకోవటం ఎంతో సంతోషంగా వుంది’.. అని చిరు ట్వీట్ చేశారు.