chiranjeevi : ఇతర భాష ఆర్టిస్ట్‌లకు మనం లోకువ అయిపోయాం.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు.. చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. రేపటి (జనవరి 13) నుండి థియేటర్ల వద్ద అభిమానులకు పూనకాలు రప్పించేందుకు సిద్దమవుతున్నాడు వీరయ్య. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వెబ్ సైట్ కి చిరు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఇతర భాష ఆర్టిస్ట్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

chiranjeevi : ఇతర భాష ఆర్టిస్ట్‌లకు మనం లోకువ అయిపోయాం.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు.. చిరంజీవి!

chiranjeevi viral comments on other state artists

Updated On : January 12, 2023 / 2:19 PM IST

chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తున్న ఈ చిత్రానికి కె బాబీ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అండ్ టీజర్ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసినవి. రేపటి (జనవరి 13) నుండి థియేటర్ల వద్ద అభిమానులకు పూనకాలు రప్పించేందుకు సిద్దమవుతున్నాడు వీరయ్య. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వెబ్ సైట్ కి చిరు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Chiranjeevi : వీరసింహారెడ్డి కోసం నన్ను డేట్ మార్చుకోమంటే.. నేను మార్చుకునేవాడిని.. చిరంజీవి!

ఈ ఇంటర్వ్యూలో ఇతర భాష ఆర్టిస్ట్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలు చిన్న బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్స్ రాబట్టాయి. మరి తెలుగు సినిమా విషయంలో బడ్జెట్ ఎందుకు అవసరం లేకున్న హద్దులు దాటుతుంది’ అని విలేకరి ప్రశ్నించాడు. దీనికి చిరంజీవి బదులిస్తూ.. “సినిమాలో విలన్ పాత్ర కోసమో లేదా ఇంకో ముఖ్య పాత్ర కోసమో డైరెక్టర్లు ఇతర భాషల నటులను అడుగుతున్నారు. దానికి నిర్మాతలు కూడా పాత్రకి న్యాయం చేసేవాడు కావాలి కదా అనే ఉద్దేశంతో వారు పక్క రాష్ట్రాల నుంచి ఆర్టిస్ట్ లను తీసుకు వస్తున్నారు.

అయితే ఆ వచ్చిన ఆర్టిస్ట్ లో అక్కడ కొద్దీ మొత్తం అడిగేవాడు, ఇక్కడ పెద్ద మొత్తంలో అడుగుతున్నాడు. ఏంటంటే తెలుగు సినిమా బడ్జెట్ లకు కొదవ లేదు, ఎంతైనా పెడతారు అనే ఒక లోకువకు గురయ్యాము. అసలు డైరెక్టర్ అనే వాడికి దమ్ము ఉంటే, ఇక్కడే చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ వారితో సినిమా తీస్తే చాలా వరకు ఖర్చు తగ్గే ఛాన్స్ ఉంది. ఇది ఒకటే కాదు సినిమా తీస్తున్నప్పుడు ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి. అప్పుడు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. దాని ద్వారా బడ్జెట్ తగ్గుతుంది” అంటూ వెల్లడించాడు.