Vishwambhara Release Date: మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ రిలీజైన రోజే ‘విశ్వంభర’ రిలీజ్?

విశ్వంభర నుంచి అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మెగా అభిమానులకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి జోష్ నింపింది విశ్వంభర టీమ్.

  • Published By: Mahesh T ,Published On : April 13, 2025 / 05:08 PM IST
Vishwambhara Release Date: మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ రిలీజైన రోజే ‘విశ్వంభర’ రిలీజ్?

Updated On : April 13, 2025 / 5:35 PM IST

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి అభిమానులను హనుమాన్ జయంతి సందర్భంగా డివోషనల్ టచ్ తో సర్ప్రైజ్ చేసింది విశ్వంభర టీమ్. ఇన్నాళ్లు చడి చప్పుడు లేకుండా ఉన్న ఈ సినిమా నుంచి అప్ డేట్స్ స్టార్ట్ అవ్వడంతో ఖుషీ అవుతున్నారు మెగాఫ్యాన్స్.

విశ్వంభర ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది? ఫ్యాన్స్ హ్యాపీయేనా?

విశ్వంభర నుంచి అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మెగా అభిమానులకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి జోష్ నింపింది విశ్వంభర టీమ్. రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా దర్శక-నిర్మాతల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డౌటే అనే ఫిక్స్ అయిపోతున్న టైమ్ లో విశ్వంభర ప్రమోషన్స్ షురూ చేసింది. రమ రామ రామ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మెగాస్టార్ అభిమానులకు డివోషనల్ టచ్ తో సర్ప్రైజ్ చేశారు.

విశ్వంభర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇష్టదైవమైన హనుమతుండి జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎంతో పేషన్స్ గా ఎదురు చూస్తోన్న చిరు అభిమానులకు.. డివోషనల్ టచ్ తో సర్ఫ్రైజ్ చేశారు. రమ రామ రామ అంటూ సాగే పాటలో చిరంజీవి లుక్స్ కి ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటకు కీరవాణి అందించిన మ్యూజిక్ కి తగ్గట్లు.. చిరు చేసిన డాన్స్ మూమెంట్స్ రివీల్ చేసి సినిమాపై ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది విశ్వంభర టీమ్.

విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ ఇదేనా..?

ఇనాళ్లూ ఎటువంటి హడావిడీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయిన విశ్వంభర టీమ్.. మెగా సెంటిమెంట్ తో ప్రమోషన్స్ షురూ చేసి.. సినిమాపై డల్ అవుతున్న బజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా చేస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ హైలెట్ కానున్నాయి. టీజర్ కు వచ్చిన మిక్స్ డ్ రెస్పాన్స్ మరోసారి రిపీట్ కాకుడదనే హై స్టాండర్డ్ అవుట్ పుట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు వశిష్ట అండ్ టీమ్. ఇటు విశ్వంభర రిలీజ్.. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ ఇంద్ర రిలీజైన తేదీనే ఉంటుందని.. సోషల్ మీడియాలో జరుగుతున్న జూలై 24 డేట్ నే లాక్ చేసుకుని ఆడియెన్స్ ముందుకు వచ్చే చాన్స్ ఉందంటున్నారు జనాలు.

Also, Read:↓
కోట్ల బడ్జెట్ తో తీసిన కొన్ని సినిమాలకు లక్షల్లో కూడా రావటంలేదని.. నిర్మాతలు ఖతర్నాక్ ఐడియా
వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సమంత యాడ్స్ లో నటిస్తుందట.. గత ఏడాది కోట్లు నష్టపోయిందట