Chiyaan Vikram : ఆకట్టుకుంటున్న చియాన్ విక్రమ్ ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ టీజర్..
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే నటుల్లో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ముందుంటారు.

Chiyaan Vikram Veera Dheera Sooran Teaser out now
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే నటుల్లో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ముందుంటారు. ఇటీవలే ఆయన తంగలాన్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ వీర ధీర సూరన్ . కాగా ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటగా రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు. ‘చిన్నా’ ఫేమ్ ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
హెచ్ఆర్. పిక్చర్స్ పతాకంపై రియాశిబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటి దుషారా విజయన్ కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎస్‌జే.సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. నిడివి ఒక నిమిషం 47 సెకన్లు. ఎవరైనా ఉన్నారా? అని ఓ మహిళా ఓ షాపు ముందు నిల్చోని అంటుంది. అప్పుడు చేయి చూపిస్తూ విక్రమ్ కొంచెం సెలెంట్‌గా ఉండండి పాప నిద్రపోతుంది అని సైగలతో చెబుతాడు.
ఈ చిత్రంలో విక్రమ్ ఓ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడని టీజర్ బట్టి అర్థమవుతోంది. ఆరంభంలో కుటుంబంపై ఉన్న ప్రేమను చూపించగా ఆఖరిలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. మొత్తంగా టీజర్ అదిరిపోయింది.
Ranbir Kapoor : గుట్టు చప్పుడుగా ‘రామాయణ’ షూటింగ్ మొత్తం కంప్లీట్.. రణబీర్ ఏమన్నాడంటే..?