Jani Master : అవన్నీ ఫేక్.. వారిపై చట్టప్రకారం చర్యలు.. డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి తొలగించడంపై జానీ మాస్టర్..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారనే ఓ వార్త వైరల్‌గా మారింది.

Choreographer Jani Master Clarify on dance union issue
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారనే ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై జానీ మాస్టర్ స్పందించారు. ఆ వార్తను జానీ మాస్టర్ ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదన్నారు. ఇక తన పదవీ కాలం ముగియకుండానే.. అనైతికంగా, అనధికారికంగా ఎన్నికలు నిర్వహించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఈ మేరకు ఓ సోషల్ మీడియాలో ఓ వీడియోను జానీ మాస్టర్ పోస్ట్ చేశారు. ‘ఉదయం నుంచి ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నన్ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఎవరు నమ్మకండి. ఇవి ఫేక్.. నన్ను ఏ అసోసియేషన్ నుంచి తొలగించలేదు. నా కార్డును ఎవరు తీసేయలేదు. నేను ఇప్పటికే డ్యాన్సర్ అసోసియేషన్‌లో సభ్యుడినే.
Ranbir Kapoor : గుట్టు చప్పుడుగా ‘రామాయణ’ షూటింగ్ మొత్తం కంప్లీట్.. రణబీర్ ఏమన్నాడంటే..?
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకంఉటాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు.’ అని ఆ వీడియో జానీ మాస్టర్ అన్నారు.
ఇక తన కొరియోగ్రఫీలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి త్వరలోనే ఓ మంచి పాట రాబోతుందని చెప్పారు. ఆ పాట ఖచ్చితంగా అందరిని అలరిస్తుందన్నారు. యూనియన్‌కు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తన వద్ద వర్క్ చేసిన చాలామంది ఇప్పుడు కొరియోగ్రాఫర్లగా మారి ఇండస్ట్రీలో రాణిస్తున్నారని జానీ మాస్టర్ తెలిపారు.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv
— Jani Master (@AlwaysJani) December 9, 2024