ఆగష్టు 1నుంచి థియేటర్లు రీ ఓపెన్ !!

ఆగష్టు 1నుంచి థియేటర్లు రీ ఓపెన్ !!

Updated On : July 27, 2020 / 10:16 PM IST

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ సినిమాల రీ ఓపెన్ కు లేటెస్ట్ గైడ్ లైన్స్ అన్ లాక్ 3.0లో భాగంగా వీటిని ప్రకటించింది. మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ నిపుణులు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ కు సినిమా థియేటర్ల రీ ఓపెన్ గురించి లేఖ ద్వారా రిక్వెస్ట్ చేశారు. మార్చి మధ్య నుంచి మూసుకుని ఉన్న థియేటర్లు తెరవాలని అందులో పేర్కొన్నారు.

ఆగష్టు నుంచి సినిమాహాళ్లు ఓపెన్ చేస్తారని ఆశపడుతున్నాం. సెప్టెంబరు చివరికల్లా అన్ని రాష్ట్రాల్లోని థియేటర్లు తెరచుకుంటాయి అని గౌతమ్ దత్తా పీవీఆర్ సినిమాస్ సీఈవో అంటున్నారు.

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేవాంగ్ సంపత్ రీ ఓపెనింగ్ కోసం అన్ని డాక్యుమెంట్లను ఆపరేటింగ్ ప్రొసీజర్ కోసం అన్నీ సిద్దం చేసినట్లు తెలిపారు. బీహార్, తమిళనాడు ఇప్పటికీ లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్ హడ్ అయిన మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

థియేటర్ ఎంట్రన్స్ లో సెన్సార్లు ఏర్పాటుచేసి టెంపరేచర్ చెక్ చేస్తామని అంటున్నారు. ఏదైనా పొరబాటుగా అనిపిస్తే కస్టమర్ ను లోనికి అనుమతించబోం. వాష్ రూం ట్యాప్ లకు కూడా సెన్సార్లతో ఫిట్ చేస్తున్నాం. థియేటర్లో 50శాతం సీటింగ్ వరకే అనుమతిస్తాం. ఇకపై ఫిజికల్ టిక్కెట్లు కూడా ఉండవు. డిజిటల్ పేమెంట్స్ మాత్రమే సమ్మతిస్తారు.

దాదాపు సినిమా థియేటర్లు మూసి వేయడం వల్ల బాలీవుడ్ కు వెయ్యి కోట్ల నష్టం వచ్చింది. కొవిడ్ 19 జీరో రెవెన్యూతో సినీ పరిశ్రమను ఘోర నష్టం వచ్చేలా చేసింది.