Senthil Kumar : రాజమౌళితో ఏ సమస్య లేదు.. మహేష్ సినిమా ఎందుకు చేయట్లేదో చెప్పిన స్టార్ సినిమాటోగ్రాఫర్..

మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు సెంథిల్ పనిచేయట్లేదు.

Senthil Kumar : రాజమౌళితో ఏ సమస్య లేదు.. మహేష్ సినిమా ఎందుకు చేయట్లేదో చెప్పిన స్టార్ సినిమాటోగ్రాఫర్..

Senthil Kumar

Updated On : July 12, 2025 / 1:52 PM IST

Senthil Kumar : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలకు చాలా వరకు కెకె సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. సై సినిమా నుంచి మొన్న వచ్చిన RRR వరకు మధ్యలో రెండు సినిమాలు తప్ప అన్ని రాజమౌళి సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. రాజమౌళి విజయంలో సెంథిల్ విజువల్స్ కీలక భాగం. బాహుబలి రెండు పార్టులు, RRR సినిమాలు కూడా అంత విజువల్ గ్రాండియర్ గా కనపడటానికి సెంథిల్ ముఖ్య కారణం.

కానీ ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు సెంథిల్ పనిచేయట్లేదు. ఈ సినిమాకు మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ PS వినోద్ వర్క్ చేస్తున్నారు. దీంతో సెంథిల్ – రాజమౌళి మధ్య ఏం జరిగింది? బాహుబలి, RRR లాంటి గ్రాండ్ విజువల్స్ ఇచ్చిన సెంథిల్ ని పక్కన పెట్టారేంటి అని చర్చే జరిగింది. తాజాగా దీనిపై సెంథిల్ స్పందించాడు.

Also Read : VISA Vintara Saradaga : ఆక‌ట్టుకుంటున్న ‘VISA- వింటారా సరదాగా’ టీజ‌ర్..

సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెంథిల్ నేడు మీడియాతో మాట్లాడగా రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి సెంథిల్ సమాధానమిస్తూ.. ప్రత్యేక కారణం ఏమి లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. గతంలో కూడా మధ్యలో విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలు నేను ఉండగానే రాజమౌళి వేరే సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసాడు. ఇప్పుడు కుదరలేదు. ఇద్దరం అనుకోని మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీదే ఈ సినిమా చెయ్యట్లేదు. తను కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా వేరే సినిమాలు చేస్తున్నాను. కుదిరితే మళ్ళీ భవిష్యత్తులో కలిసి సినిమాలు చేస్తాము అని తెలిపాడు.

Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది..