Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది..

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Shiva Rajkumar first look from Ramcharan Peddi movie

Updated On : July 12, 2025 / 10:32 AM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

నేడు శివ‌రాజ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ చిత్రంలోని ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేసింది. శివ‌న్న ఎంతో సీరియ‌స్‌గా చూస్తున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

Prabhas : కొత్త అవతారం ఎత్తబోతున్న ప్రభాస్

ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.