Prabhas : కొత్త అవతారం ఎత్తబోతున్న ప్రభాస్
ది రాజా సాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.

Prabhas will sing song in The Raja Saab
ది రాజా సాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీని డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు, పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా అదే స్పీడ్‌లో సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర గాసిప్ బయటకు వచ్చింది. ప్రభాస్ ఈ మూవీలో ఒక పాటను స్వయంగా పాడుతున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు పాటలు పాడిన సందర్భాల్లేవు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఈ గాసిప్ మంచి కిక్ ఇస్తోంది. ప్రభాస్ పాడే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నారని సమచారం. సినిమాకే హైలెట్‌గా నిలిచే ఈ పాటను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారట తమన్.
చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పాటలు పడి ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ది రాజా సాబ్‌లో ఓ పాట కోసం గొంతువిప్పనున్నారని సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ ఈ పాట కోసం స్టూడియోలో గంటల తరబడి కష్టపడుతున్నాడట.
తమన్‌తో కలిసి ఈ సాంగ్‌ను పర్ఫెక్ట్‌గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై, ప్రభాస్ వింటేజ్ లుక్ తమన్ బీజీఎం అభిమానుల్ని ఆకర్షించాయి. మొత్తానికి ప్రభాస్ వాయిస్ ఈ మూవీలో బిగ్ హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గాసిప్ నిజమైతే ప్రభాస్ కూడా తన సింగింగ్ టాలెంట్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచే అవకాశం ఉందన్నమాట.