Prabhas : ఈ డైరెక్టర్ ఎవడ్రా బాబు.. ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే వద్దనుకుని వదిలేసాడంట.. ఏ సినిమానో తెలుసా?

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, అది ఏ సినిమానో తెలుసా?

Prabhas : ఈ డైరెక్టర్ ఎవడ్రా బాబు.. ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే వద్దనుకుని వదిలేసాడంట.. ఏ సినిమానో తెలుసా?

Prabhas

Updated On : July 11, 2025 / 9:30 PM IST

Prabhas : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియా అంతా దర్శకులు క్యూ కడుతాయారు. కానీ ఓ దర్శకుడికి ప్రభాస్ తో సినిమా ఛాన్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా వద్దనుకుని వదిలేసాడంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, అది ఏ సినిమానో తెలుసా? అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు 20 ఏళ్ళ క్రితం సంగతి.

ప్రభాస్ 2007లో యోగి సినిమా చేసిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ సినిమా జోగి కి రీమేక్ గా తెరకెక్కింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో జోగి సినిమా తెరకెక్కినది. జోగి హిట్ అవ్వడంతో ఆ రైట్స్ కొని ఆ సినిమాని ప్రభాస్ తో డైరెక్ట్ చేయమని ప్రేమ్ కి ఆఫర్ ఇచ్చారంట.

Also Read : Vishnu Vishal : నేను హీరో అన్నారు.. రజినీకాంత్ గెస్ట్ రోల్ అన్నారు.. కానీ..

తాజాగా డైరెక్టర్ ప్రేమ్ తన KD సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ కి రాగా దీనిపై మాట్లాడుతూ.. ప్రభాస్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది కానీ చేయలేకపోయాను. కన్నడలో నేను జోగి అనే సినిమా తీసాను. అది ఇక్కడ యోగి గా తీసారు. ఆ సినిమాను నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ నాకు తెలుగు రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల సినిమా డైరెక్షన్ కి నో చెప్పాను. రైట్స్ ఇచ్చి వేరే వాళ్లతో చేయించుకోమని చెప్పాను అని తెలిపాడు.

దీంతో పలువురు నెటిజన్లు లాంగ్వేజ్ రాకపోతే అసిస్టెంట్స్ ని పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు కదా, ప్రభాస్ తో సినిమా మిస్ అయ్యారు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Junior : ‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీలీల – జెనీలియా ఒకే సినిమాలో..