Vishnu Vishal : నేను హీరో అన్నారు.. రజినీకాంత్ గెస్ట్ రోల్ అన్నారు.. కానీ..
తాజాగా నటుడు విష్ణు విశాల్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

Vishnu Vishal
Vishnu Vishal : ఇటీవల ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలు గెస్ట్ రోల్ చేస్తే ఫ్యాన్స్ అంతా సినిమాకు వస్తారని భావిస్తారు. కానీ ఆ గెస్ట్ రోల్ కాస్త పెరిగి ఫుల్ రోల్ అయితే మొదటికే మోసం వస్తుంది. అలా లాల్ సలాం సినిమాకు జరిగింది.
సౌందర్య కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ లీడ్స్ గా రజినీకాంత్ గెస్ట్ రోల్ గా తెరకెక్కిన లాల్ సలాం గత సంవత్సరం రిలీజయి భారీ ఫ్లాప్ అయింది. తాజాగా నటుడు విష్ణు విశాల్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
Also Read : Junior : ‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీలీల – జెనీలియా ఒకే సినిమాలో..
విష్ణు విశాల్ మాట్లాడుతూ.. లాల్ సలాం సినిమాలో నేనే హీరోని. రజినీకాంత్ గారిది 25 నిమిషాల రోల్. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అయి అది మారిపోయి ఆయనది ఒక గంట రోల్ అయింది. దాంతో అది ఆయన సినిమాగా మారింది. రజినీకాంత్ గారి సినిమాలో నేను నటించినందుకు సంతోషమే కానీ అది బాక్సఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అని అన్నారు. జనాలు కూడా అది విష్ణు విశాల్ సినిమా అని కాకుండా రజినీకాంత్ సినిమా అని అంచనాలు పెట్టుకొని వెళ్లారు. దీంతో ఆడియన్స్ కి నిరాశ తప్పలేదు.