Nara Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..

తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు.

Nara Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..

CM Chandrababu Naidu Brother Nara Rohit Father Nara Ramamurthy Naidu Passed Away

Updated On : November 16, 2024 / 3:13 PM IST

Nara Ramamurthy Naidu : తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు. ఈయన హీరో నారా రోహిత్ తండ్రి కూడా. ఇటీవలే నారా రోహిత్ నిశ్చితార్థం జరగ్గా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేసారు. అయితే నవంబర్ 14న నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడుకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. గత రెండు రోజులుగా చికిత్స అందిస్తుండగా ఆయన నేడు మధ్యాహ్నం 12.45 గంటలకు మరణించినట్టు హాస్పిటల్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Nara Ramamurthy Naidu: తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు

ఇక రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు నారావారి పల్లెలో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే నారా లోకేష్ హైదరాబాద్ లోని హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉండగా తమ్ముడి మరణంతో విషాదంలో మునిగిపోయి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని హైదరాబాద్ వస్తున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు మరణంతో నారా కుటుంబంలో, నారా వారి పల్లెలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ రామ్మూర్తి నాయుడుకు నివాళులు అర్పిస్తున్నారు.