తారక్ నోట జై బాలయ్య – పెళ్ళిలో ధూమ్ ధామ్

జై బాలయ్యా అని అరిచిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో

  • Published By: sekhar ,Published On : December 31, 2018 / 10:00 AM IST
తారక్ నోట జై బాలయ్య – పెళ్ళిలో ధూమ్ ధామ్

జై బాలయ్యా అని అరిచిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో

రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్, జగపతి బాబు అన్నయ్య కుమార్తె పూజా ప్రసాద్‌తో నిన్న రాజస్థాన్‌లోని, జైపూర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. గత మూడు రోజులుగా రాజమౌళి, ప్రభాస్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో, పలువురు సెలబ్రిటీల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సంగీత్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,  జై బాలయ్యా అని అరిచిన వీడియో ఒకటి ఆన్ లైన్‌లో హల్ చల్ చేస్తోంది.

కార్తికేయ సంగీత్ ఫంక్షన్‌లో జగపతి బాబు, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, అఖిల్ తదితరులు సరదాగా స్పెండ్ చేస్తున్న టైమ్‌లో రాజమౌళి రిలేటివ్స్‌లో ఒకరు సడెన్‌గా జై బాలయ్యా అని అరిచారు. దీంతో, అఖిల్‌తో మాట్లాడుతున్న ఎన్టీఆర్ కూడా, రెస్పాండ్ అవుతూ, అంతే బిగ్గరగా, ఫుల్ జోష్‌తో జై బాలయ్యా అని అరిచాడు. తారక్ అరిచిన వెంటనే కోరస్‌గా అందరూ.. మళ్ళీ, జై బాలయ్యా అని గట్టిగా అరవడం విశేషం.

గత కొద్ది కాలంగా బాలయ్యకి, తారక్‌కి మధ్య మాటలు లేవనే సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణంతో వీళ్ళు తిరిగి దగ్గరయ్యారు. తారక్ అరవింద సమేత సక్సెస్ మీట్‌కి బాలయ్య అటెండ్ అయితే, బాలయ్య ఎన్టీఆర్ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసందే. బాబాయ్, అబ్బాయ్‌లు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న సమయంలో, తారక్
జై బాలయ్యా అని అరవడం నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసేస్తున్నారు తారక్ అండ్ బాలయ్య ఫ్యాన్స్.

వాచ్ వీడియో..

 

#NTR in full form of energy and Josh! And here is the proof-video with #JaiBalayya slogans at #SSRajamouli son’s wedding bash!??#NTR #SSRajamouli #Karthikeya #JaiBalayyaSlogans pic.twitter.com/uEZUg2Pg5o

— Shreyas Group (@shreyasgroup) December 30, 2018