బసవ తారకమ్మ బర్త్‌డే పోస్టర్

ఎన్టీఆర్ కథానాయకుడు నుండి విద్యా బాలన్ న్యూ పోస్టర్

  • Published By: sekhar ,Published On : January 1, 2019 / 06:22 AM IST
బసవ తారకమ్మ బర్త్‌డే పోస్టర్

ఎన్టీఆర్ కథానాయకుడు నుండి విద్యా బాలన్ న్యూ పోస్టర్

స్వర్గీయ జీవిత కథతో, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రెండు పార్ట్‌‌లుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌కీ, ఆడియోకీ మంచి స్పందన వస్తుంది. ఫస్ట్ పార్ట్  కథానాయకుడు రిలీజ్‌కి తక్కువ టైమ్ ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే బాలయ్య రకరకాల గెటప్స్‌లో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్, జనవరి 1న విద్యా బాలన్ బర్త్‌డే సందర్భంగా న్యూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యా బాలన్, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

వెండితెర తారకమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దివిలోని తారకరాముల తరపున, భువిపైని తెలుగువారందరి తరపున అంటూ, మూవీ యూనిట్, విద్యా బాలన్‌‌ని విష్ చేసారు. బాలయ్య, విద్యా బాలన్.. అదేనండీ, ఎన్టీఆర్, బసవతారకం ఇద్దరూ తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయిస్తున్న పోస్టర్ రిలీజ్ చేసి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.