24 గంటల్లో విధ్వంసం సృష్టించిన విధేయ రాముడు

సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడూ మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా.. అంటూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తూ, చరణ్ తన ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీనిచ్చాడు.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 06:32 AM IST
24 గంటల్లో విధ్వంసం సృష్టించిన విధేయ రాముడు

సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడూ మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా.. అంటూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తూ, చరణ్ తన ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీనిచ్చాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ.. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. వినయ విధేయ రామ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడూ మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చా.. అంటూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెప్తూ, చరణ్ తన ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీనిచ్చాడు.

బోయపాటి తన మాస్ మసాలా మార్క్‌కి తగ్గట్టుగా చరణ్‌ని మార్చడం, చరణ్ కూడా తనలోని మాస్ యాంగిల్‌ని పూర్తిగా బయటకి తియ్యడంతో వినయ విధేయ రామ ట్రైలర్, మెగాభిమానుల్నీ, మాస్ ఆడియన్స్‌నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో, అక్షరాలా 7.7 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. కేవలం 22 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మరోపక్క యూట్యూబ్ ట్రెండింగ్‌లోనూ, వినయ విధేయ రామ ట్రైలర్ టాప్ ప్లేస్‌లో ఉంది.

చరణ్ పక్కన కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్ ఫేమ్), స్నేహా తదితరులు కీలక పాత్రల్లో నటించిన వినయ విధేయ రామ, సంక్రాంతి కానుకగా, జనవరి 11న విడుదల కానుంది.

వాచ్ వినయ విధేయ రామ ట్రైలర్…