కొత్త సంవత్సరం, కొత్త లుక్

వినయ విధేయ టీమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరం, కొత్త లుక్

Contentvinaya Vidheya Rama New Look 10tv 205

Updated On : June 21, 2021 / 10:45 PM IST

వినయ విధేయ టీమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా,  వినయ విధేయ రామ.. షర్ట్ లెస్‌గా ఒంటి నిండా టాటూలతో, భారీ మిషన్ గన్‌ పట్టుకుని ఉన్న చెర్రీ లుక్‌ని రిలీజ్ చేసిన మూవీ యూనిట్, తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరో మూడు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 31 రాత్రి, చరణ్ ఫ్యామిలీతో కలిసి ఉన్న స్టిల్‌తో పాటు, విలన్ వివేక్ ఒబెరాయ్‌తో తలపడుతున్న సీరియస్ లుక్ కూడా రిలీజ్ చేసారు.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో, వినయ విధేయుడిలోని లవ్ యాంగిల్‌ని చూపించాడు బోయపాటి. టెంపుల్‌లో చరణ్ కాస్త కిందకి వంగి, హీరోయిన్ కైరా అద్వాణీ కాలుని ఒక చేత్తో, చేతిని మరో చేతితో పట్టుకుని పైకి లేపుతున్నాడు. వెనక ఫ్యామిలీ అంతా ఉన్నారు. రిలీజ్‌కి మరికొద్ది రోజులే ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. జనవరి 11న, వినయ విధేయ రామ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
VVR