‘ఖాకీ వేస్తే పోలీస్, తీస్తే రౌడీ’ : దబంగ్ 3 ట్రైలర్
ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటిస్తున్న ‘దబాంగ్ 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల..

ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటిస్తున్న ‘దబాంగ్ 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల..
సల్మాన్ ఖాన్ ‘చుల్‌బుల్ రాబిన్‌హుడ్ పాండే’గా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’ సినిమాల తర్వాత.. ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటిస్తున్న ‘దబాంగ్ 3’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు… ‘ఖాకీ వేస్తే పోలీస్, తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్‌రౌండర్‌ని’ అంటూ సల్మాన్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్.. సల్మాన్ మార్క్ మేనరిజమ్స్, కామెడీ, రొమాన్స్ అండ్ యాక్షన్ అంతా ట్రైలర్‌లో చూడొచ్చు.
‘ప్రేమించేది నేనే, ప్రాణాలు తీసేది నేనే.. ఆటకైనా వేటకైనా రెడీ’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. విజువల్స్ అండ్ ఆర్ఆర్ బాగున్నాయి. ‘కిచ్చా’ సుదీప్ విలన్‌గా నటించగా, ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ బాలీవుడ్‌కి పరిచయమవుతుంది. ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కథనందించడం విశేషం.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ భాషల్లో ‘దబాంగ్ 3’ విడుదల కానుంది.
Read Also : ఫ్యామిలీ ఫ్యామిలీ దిగిపోయారుగా : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా!
మ్యూజిక్ : సాజిద్ వాజిద్, సినిమాటోగ్రఫీ : మహేష్ లిమాయే, ఎడిటింగ్ : రితేష్ సోనీ, స్టోరీ : సల్మాన్ ఖాన్, స్క్రీన్‌ప్లే : సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, దిలీప్ శుక్లా, అలోక్ ఉపాధ్యాయ, యాక్షన్ : అనల్ అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జితేంద్ర చతుర్వేది.