దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 : బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు

దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కేసౌత్ అవార్డ్స్ 2019..

  • Published By: sekhar ,Published On : September 21, 2019 / 05:13 AM IST
దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 : బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు

Updated On : September 21, 2019 / 5:13 AM IST

దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కేసౌత్ అవార్డ్స్ 2019..

భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేసౌత్ అవార్డ్స్ 2019కు తెరలేచింది. దాదాసాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్‌లో ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు సిఎస్ పుసాల్కర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘భరత్ అనే నేను’ మూవీకిగానూ ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాగా.. మహేష్ భార్య నమ్రత అవార్డ్ స్వీకరించింది. సీనియర్ నటుడు ‘మంచు మోహన్ బాబు’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

Read Also : నా కడుపున దేవదాస్ పుట్టాలి – 90ML టీజర్!

‘కేజీఎఫ్’ సినిమాకు ‘రాకింగ్ స్టార్ యష్’, ‘రంగస్థలం’ చిత్రానికి డైరెక్టర్ ‘సుకుమార్’, మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవిశ్రీ ప్రసాద్’, సినిమాటోగ్రాఫర్ ‘రత్నవేలు’, ‘ఆర్ఎక్స్ 100’కి గానూ ‘పాయల్ రాజ్‌పుత్’ తదితరులు అవార్డులందుకున్నారు. మంచు లక్ష్మీ, అవికాగోర్, ఆకాంక్ష సింగ్, అవంతికా మిశ్రా, అనూప్ ఠాకూర్ సింగ్, సంపూర్ణేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.