Bhagavanth Kesari : థియేటర్స్ లో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్.. బాలయ్య, కాజల్ మాస్ డ్యాన్స్..

భగవంత్ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురు సాంగ్ షూట్ చేసి, అది లేకుండానే సినిమా రిలిజ్ చేశారు. సినిమా హిట్ అయ్యాక వారం రోజుల తర్వాత ఆ పాటని థియేటర్స్ లో జత చేస్తామని తెలిపారు.

Bhagavanth Kesari : థియేటర్స్ లో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్.. బాలయ్య, కాజల్ మాస్ డ్యాన్స్..

Danchave Menatta Kutura Song Added in Bhagavanth Kesari Movie

Updated On : October 28, 2023 / 12:20 PM IST

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలయ్య మాస్ తో పాటు మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంతో సినిమా మరింత ఎక్కువమందికి రీచ్ అవుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురు సాంగ్ షూట్ చేసి, అది లేకుండానే సినిమా రిలిజ్ చేశారు. సినిమా హిట్ అయ్యాక వారం రోజుల తర్వాత ఆ పాటని థియేటర్స్ లో జత చేస్తామని తెలిపారు. తాజాగా దంచవే మేనత్త కూతురు సాంగ్ ని థియేటర్స్ లో యాడ్ చేశారు. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ అయిన పాట దంచవే మేనత్త కూతురా. ఈ సాంగ్ రీమిక్స్ చేయడంతో అభిమానులు మరోసారి ఈ పాట కోసం థియేటర్స్ కి వెళ్తున్నారు.

Also Read : Dil Raju : టాలీవుడ్ లో మరో పెళ్లి.. దిల్ రాజు ఇంట పెళ్లి సందడి?

ఈ పాట సినిమా చివర్లో అభిమానుల కోసమే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో బాలయ్య, కాజల్ కలిసి మాస్ స్టెప్పులు వేసి అలరించారు. శ్రీలీల కూడా వీరితో కలిసి స్టెప్పులు వేసింది. కాజల్, శ్రీలీల హాఫ్ శారీలు కట్టుకొని దంచవే మేనత్త కూతురా సాంగ్ కి స్టెప్పులు వేస్తుంటే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. దీంతో ఈ పాట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎన్ని రికార్డ్ బద్దలుకొడుతుందో చూడాలి.