Extra Ordinary Man : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ నుంచి క్రేజీ అప్డేట్‌.. హార్ట్ ట‌చింగ్ మెలోడి..

యంగ్ హీరో నితిన్ (Nithiin)న‌టిస్తున్న చిత్రం‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌(SreeLeela). ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

Extra Ordinary Man : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ నుంచి క్రేజీ అప్డేట్‌.. హార్ట్ ట‌చింగ్ మెలోడి..

Extra Ordinary Man

Updated On : July 30, 2023 / 9:03 PM IST

Danger Pilla Lyrical Promo : యంగ్ హీరో నితిన్ (Nithiin)న‌టిస్తున్న చిత్రం‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌(SreeLeela). ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం తెలియ‌జేసింది.

Sreejita De : ఆటోలో ప్రియుడికి ఘాటు లిప్ లాక్‌కిస్ ఇచ్చిన బాలీవుడ్ భామ.. వీడియో వైరల్!

తాజాగా చిత్ర బృందం మ‌రో క్రేజీ అప్డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రానుంది. డేంజ‌ర్ పిల్లా అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను రేపు (జూలై 31 సోమ‌వారం) ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ పాట హార్ట్ ట‌చింగ్ మెలోడిగా ఉండ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ సినిమాకి హారీస్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ స‌రికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన

ఇదిలా ఉంటే.. వెంకీకుడుముల ద‌ర్శ‌క‌త్వంలో VNRTrio వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ నితిన్ న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. క‌న్న‌డ అందం ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర బృందం ఎప్పుడో తెలియ‌జేసింది. అయితే.. ఇటీవ‌ల ఈ సినిమా ఆమె త‌ప్పుకుంద‌ని వార్తలు వినిపించాయి. దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించ‌లేదు.

Ramya Krishna : త‌మ‌న్నా పాట‌కు ర‌మ్య‌కృష్ణ చిందులు.. వీడియో వైర‌ల్‌