Das Ka Dhamki : అదిరిపోయిన దాస్ కా ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..
దాస్ కా ధమ్కీ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకే విశ్వక్ కి ఇప్పటివరకు హైయెస్ట్....................
Das Ka Dhamki : విశ్వక్ సేన్(Vishwaksen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki). ఉగాది(Ugadi) పండుగ నాడు మార్చ్ 22న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్. ముందు నుంచి ఈ సినిమాపై భారీ హైప్స్ పెంచేసి, భారీగా ప్రమోట్ చేసి అంచనాలు పెట్టాడు విశ్వక్. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని అభిమానులని, ప్రేక్షకులని ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలా అలరించింది దాస్ కా ధమ్కీ.
దాస్ కా ధమ్కీ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకే విశ్వక్ కి ఇప్పటివరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాస్ కా ధమ్కీ సినిమాకు దాదాపు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా మొదటి రోజే ఏకంగా 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక సినిమా హిట్ టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి.
Sri Ramanavami : శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్లు.. టాలీవుడ్ లోనే పండగ అంతా..
తాజాగా విశ్వక్ దాస్ కా ధమ్కీ సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తి అయింది. మార్చ్ 29 వరకు వారం రోజులకు దాస్ కా ధమ్కీ సినిమా ఏకంగా 21.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ అయి ఫుల్ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. ఇక్కడ తెలుగు స్టేట్స్ లోనే కాక అమెరికాలో కూడా దాస్ కా ధమ్కీ కి మంచి వసూళ్లు వచ్చాయి. మొత్తానికి సొంత నిర్మాణ, దర్శకత్వంలో విశ్వక్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఇంకా ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో చిత్రయూనిట్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విశ్వక్ మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!❤️
Das Ka Mass Blockbuster #DasKaDhamki collected a Massive 21.80 Cr WW Gross in its first week🔥
Entering 2nd Week successfully in theatres 😃@VishwakSenActor @Nivetha_Tweets @VScinemas_ pic.twitter.com/dA5MJIIPX0
— VanmayeCreations (@VanmayeCreation) March 30, 2023