Dasara Movie: నైజాంలో కొనసాగుతున్న ‘దసరా’ స్ట్రాంగ్ రన్..!

నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. నైజాం ఏరియాలో దసరా మూవీ వసూళ్లు ఇంకా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి.

Dasara Movie: నైజాంలో కొనసాగుతున్న ‘దసరా’ స్ట్రాంగ్ రన్..!

Dasara Movie Continues Strong Run In Nizam

Updated On : April 15, 2023 / 9:45 PM IST

Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

Dasara : ‘దసరా’లోని డిలీట్ సీన్ చూశారా.. సూపర్ ఉంది!

కాగా, ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.110 కోట్ల వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు రిలీజ్ అయినా, దసరా మాత్రం తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో దసరా మూవీ వసూళ్లు ఇంకా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి.

Dasara : ‘దసరా’లోని డిలీట్ సీన్ చూశారా.. సూపర్ ఉంది!

ప్రస్తుతం నైజాం ఏరియాలో మెజారిటీగా సింగిల్ స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతన్న దసరా మూవీకి అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా టోటల్ రన్‌లో నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టడం ఖాయమని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.