Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా?

డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో మరో మూవీ కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆశక్తి నెలకుంది. ఇక ఈ నిరీక్షణకు తెర దించుతూ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ సినిమా ప్రకటించాడు హరీష్ శంకర్. అయితే గత మూడు రోజులుగా ఈ మూవీ ‘తేరీ’ రీమేక్ అంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ...

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా?

Dasaradh is screenplay writer for Ustaad Bhagat Singh

Updated On : December 11, 2022 / 3:50 PM IST

Ustaad Bhagat Singh : దాదాపు దశాబ్దం తరవాత టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూపుకి మోక్షం దక్కింది. డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలుసు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆశక్తి నెలకుంది. ఇక ఈ నిరీక్షణకు తెర దించుతూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ సినిమా ప్రకటించాడు హరీష్ శంకర్.

Ustaad Bhagat Singh: పవర్ స్టార్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది సినిమా. అయితే గత మూడు రోజులుగా ఈ మూవీ ‘తేరీ’ రీమేక్ అంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో ఎటువంటి నిజం లేదని నేటితో తేలిపోయింది. ఈ సినిమాకి హరీష్ శంకర్ కథని అందిస్తున్నాడు. సి చంద్ర మోహన్ కథా సహకారం చేశాడు. టాలీవుడ్ డైరెక్టర్ కె దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం సినిమాలకు అదిరిపోయే కథనం అందించిన దశరథ్ ఈ మూవీకి పని చేస్తుండడంతో అంచనాలు మరెంత పెరిగిపోయాయి.

కాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో గబ్బర్ సింగ్ మూవీ కూడా దేవినే సంగీతం అందించాడు. ఆ సమయంలో దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి ఆరో ప్రాణమని చెప్పాలి. అలాగే పవన్, దేవిశ్రీ కలయికలో వచ్చిన ఆల్బమ్స్ అన్ని కూడా బ్లాక్ బస్టర్. అసలే పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దేవి ఈ సినిమాకు ఎలా ఇవ్వబోతున్నాడో అని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి.