డియర్ కామ్రేడ్.. టీజర్ చూశారా?

  • Published By: vamsi ,Published On : March 17, 2019 / 08:26 AM IST
డియర్ కామ్రేడ్.. టీజర్ చూశారా?

Updated On : March 17, 2019 / 8:26 AM IST

పెళ్లి చూపలు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా.. వరుస హిట్ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మొత్తం నాలుగు బాషలలో విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రూపొందుతున్న ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాలేజీ రాజకీయాలు, ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.