Deepika Padukone : ఖతార్ ఎయిర్‌వేస్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరోయిన్..
తాజాగా ఖతార్ ఎయిర్‌వేస్ తన బ్రాండ్ కి గ్లోబల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని నియమించారు. ఈ సందర్భంగా దీపికా పదుకొనే తో తెరకెక్కించిన ఓ యాడ్ ని ఖతార్ ఎయిర్‌వేస్.....................

Deepika Padukone as Global Brand ambassador for Qatar Airways
Deepika Padukone : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ ఎయిర్ లైన్స్ లో ఖతార్ ఎయిర్‌వేస్ ఒకటి. ఖతార్ ఎయిర్‌వేస్ ఇటీవలే ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ ఇచ్చే వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్స్ లో ఎయిర్ లైన్ అఫ్ ది ఇయర్ అవార్డు 2022 సంవత్సరానికి గాను గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకోవడం ఖతార్ ఎయిర్‌వేస్ కు ఇది ఏడోసారి. ఇదే కాకుండా అనేక అవార్డులని కూడా గెలుచుకుంది ఖతార్ ఎయిర్‌వేస్.
ఖతార్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తమ ఎయిర్ పోర్ట్స్ నుంచి దాదాపు 150 దేశాలకు ఫ్లైట్స్ ని నడుపుతుంది. తాజాగా ఖతార్ ఎయిర్‌వేస్ తన బ్రాండ్ కి గ్లోబల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని నియమించారు. ఈ సందర్భంగా దీపికా పదుకొనే తో తెరకెక్కించిన ఓ యాడ్ ని ఖతార్ ఎయిర్‌వేస్ రిలీజ్ చేశారు. ఇందులో తమ ఎయిర్ పోర్ట్స్, ఫ్లైట్స్ ఎంత సౌకర్యంగా ఉంటాయో, ఎంత లగ్జరీగా ఉంటాయో చూపించారు. ఈ యాడ్ ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంత లగ్జరీగా ఖతార్ ఎయిర్‌వేస్ తో తప్ప ఇంకా దేంట్లోను ప్రయాణించలేరు. మా కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ దీపికా పదుకొనేను మీకు పరిచయం చేస్తున్నాం అని పోస్ట్ చేసింది.
దీంతో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌వేస్ లో ఒకటైన ఖతార్ ఎయిర్‌వేస్ కి దీపికా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలవడంతో పలువురు ప్రముఖులు, దీపికా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
There's nothing else quite like the luxury of travelling with Qatar Airways ✈️
Introducing our brand-new film featuring our global brand ambassador @deepikapadukone pic.twitter.com/NjAgXInl7v
— Qatar Airways (@qatarairways) February 28, 2023