Deepika Padukone : మొన్న కాన్స్.. నేడు ఆస్కార్.. ఆస్కార్ అవార్డు ప్రజెంటర్స్ లో దీపికా..
తాజాగా ఆస్కార్ నిర్వాహకులు ఆస్కార్ ప్రజెంటర్స్ పేర్లని ప్రకటించగా అందులో మన ఇండియా నుంచి దీపికా పదుకొనే పేరు ఉంది. దీంతో దీపికా అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికాకు....................

Deepika Padukone listed in Oscar presenters list given by The Academy and India proud again
Deepika Padukone : ఇటీవల మన దేశ సినిమాలకు, సినీ వ్యక్తులకు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల, అనేక రకాలుగా వస్తున్న గుర్తింపు తెలిసిందే. ప్రస్తుతం దేశమంతా ఆస్కార్ వేడుకల కోసం ఎదురుచూస్తుంది. RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రెండు డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచాయి. దీంతో ఆస్కార్స్ 2023 ఇండియా ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మారింది.
మార్చ్ 12న జరుగనున్న ఆస్కార్ వేడుకల కోసం ఇప్పటికే RRR యూనిట్ అంతా అమెరికా చేరుకున్నారు. తమ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఎలాగైనా నాటు నాటు సాంగ్ కి అవార్డు రావాలని ఇండియా అంతా కోరుకుంటుంది. ఇక ఆస్కార్ వేదికపై మన సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ ని లైవ్ లో పాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ నుంచి భారతీయులకు మరో సంతోషకరమైన వార్త అందింది.
తాజాగా ఆస్కార్ నిర్వాహకులు ఆస్కార్ ప్రజెంటర్స్ పేర్లని ప్రకటించగా అందులో మన ఇండియా నుంచి దీపికా పదుకొనే పేరు ఉంది. దీంతో దీపికా అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికాకు అరుదైన గౌరవం లభించిందని అంటున్నారు. గత సంవత్సరం కూడా దీపికా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్ లో ఉంది. దీంతో గత సంవత్సరం కాన్స్ లో మన దేశ ప్రతిష్టని దీపికా పెంచగా ఇప్పుడు మరోసారి ఆస్కార్ వేదికపై మన దేశం తరపున వెళ్లడం ఆనందం. దీంతో ఇప్పుడు అంతా దీపికాకు అభినందనలు తెలుపుతున్నారు.
Meet your first slate of presenters for the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/U87WDh88MR
— The Academy (@TheAcademy) March 2, 2023