న్యూ లుక్..యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ దీపికా పదుకొనే.. వెండితెరపై మెరిసి ఏడాది అవుతోంది. అయితే తాజాగా ఆమె ఓ కొత్త సినిమాలో మరింత కొత్తగా..డీగ్లామరస్ లుక్ లో అభిమానులకు కనిపించబోతుంది.
ప్రస్తుతం ఆమె ‘చపాక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఢిల్లీ యాసిడ్ దాడికి గురైన అమ్మాయి లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా నటించబోతుంది. ఈ చిత్రంలోని దీపికా ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. యాసిడ్ బాధితురాలిగా తన లుక్‌ను దీపికా ట్వీట్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజి’ ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన పద్మావత్ తర్వాత దీపికా ఏ సినిమాలోనే నటించలేదు. పెళ్లి తర్వాత ఏం సినిమా చేయాలి? ఎలాంటి సినిమాల్లో నటించాలి అన్న దానిపై ఆలోచనలు చేసింది దీపికా. దీంతో ఆమె ఇప్పుడు చప్పక్ సినమాతో మరోసారి కెమెరా ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత దీపిక.. చేస్తున్న తొలి చిత్రం ఇది.
2005లో యాసిడ్ దాడి కారణంగా బాధింపబడి, యాసిడ్ ఎటాక్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పలు అవార్డులు అందుకున్నారు లక్ష్మీ అగర్వాల్. ఇప్పుడు ఆమె పాత్రలో దీపికా నటించటం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.