మహాభారతంలో ద్రౌపదిగా దీపిక

‘మహాభారత్’ లో ద్రౌపది క్యారెక్టర్ చేయడంతో పాటు, ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనతో కలిసి సహ నిర్మాతగానూ వ్యవహరించనుంది దీపిక..

  • Published By: sekhar ,Published On : October 25, 2019 / 07:53 AM IST
మహాభారతంలో ద్రౌపదిగా దీపిక

Updated On : May 28, 2020 / 4:15 PM IST

‘మహాభారత్’ లో ద్రౌపది క్యారెక్టర్ చేయడంతో పాటు, ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనతో కలిసి సహ నిర్మాతగానూ వ్యవహరించనుంది దీపిక..

భారత రామాయణ ఇతిహాసాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెర మీదకు  తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి.. మూడు భాగాలుగా రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. నితేష్ తివారి (‘దంగల్’), రవి ఉడయార్(‘మామ్’) దర్శకత్వం వహిస్తారు.

Read Also : యాక్షన్ : రాధికా ఆప్టే దర్శకత్వంలో ‘స్లీప్ వాకెర్స్’

‘మహాభారత్’ పేరుతో తెరకెక్కున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే ద్రౌపది క్యారెక్టర్ చేయనుంది. ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి పీరియాడిక్‌ ఫిల్మ్స్‌లో అలరించిన దీపిక తనకు మహాభారతంలో ద్రౌపది పాత్ర లభించడం జీవితకాల అవకాశమని చెప్పుకొచ్చింది. మహాభారతం కథలు కథలుగా మనం తరతరాలుగా చెప్పుకున్నా అవన్నీ పురుషుడి ఆధారంగా అల్లుకున్న కథలు కాగా తొలిసారిగా మహిళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ద్రౌపది పాత్రలో నటించడం తాను గౌరవంగా భావిస్తున్నానని, థ్రిల్‌కు గురవుతున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక చారిత్రక దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్న ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనతో కలిసి దీపిక సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుంది.

దీపికా టీమ్‌లో చేరడంతోనే ఈ మూవీకి భారీతనం వచ్చిందని, ఆమె భారత్‌లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని మధు మంతెన అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ  తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది..